హైదరాబాద్: 28°C
తెలంగాణ

వందేమాతరం క్యాంప్‌కు పత్తిపాక యువశక్తి యూత్ ఎంపిక

PDPL: ధర్మారం (M) పత్తిపాక యువశక్తి యూత్ సభ్యులు రేశవేణి మహేష్, కర్ణ ధీరజ్, దుడ్డల రాజ్‌కుమార్ వందేమాతరం క్యాంప్‌కు ఎంపికయ్యారు. మహారాష్ట్ర జల్గావ్‌లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు శిబిరం జరగనుంది. మేరా యువ భారత్ సేవలను గుర్తించి అవకాశం కల్పించింది. జిల్లా తరఫున పాల్గొంటారు. యువకులను జిల్లా యువజన అధికారి గోలి తిరుపతిరెడ్డి, సర్పంచ్ శ్రావణి అభినందించారు.