హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించాలి

NRML: జిల్లా పంట మార్పిడి విధానాలపై రైతుల్లో ఎప్పటికప్పుడు విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే, జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.