హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల నిర్లక్ష్యంతో వృథాగా పోతున్న తాగునీరు

NGKL: ఊర్కొండ మండలం రాచాలపల్లి గ్రామ శివారులోని కాల్యతండా సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ ఎయిర్ వాల్వ్ లీకేజీ కారణంగా నీరు వృథాగా పోతోంది. రోడ్డు పక్కనే నీరు నిరంతరం వృథా అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీకేజీని అరికట్టి, నీటి వృథాను నివారించాలని అధికారులను కోరుతున్నారు.