హైదరాబాద్: 28°C
తెలంగాణ

బహిరంగ మార్కెట్‌లో వరికి ఎక్కువ ధర!

VKB: బొంరాస్పేట పరిధిలోని పలు గ్రామాలలో IKP, PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇటీవల ప్రారంభించారు. కానీ బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధర కంటే వరికి ఎక్కువ ధర పలుకుతున్నందున రైతుల వద్దకు దళారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం క్వింటాలుకు ఏ గ్రేడు రూ.2,461 ధర నిర్ణయించగా, బయట మార్కెట్‌లో రూ.2,800 వరకు ధర పలుకుతుంది.