హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి ఉమ్మడి జిల్లా క్రీడా ఎంపికలు

ఉమ్మడి జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని క్రీడా పాఠశాలలో నేడు, రేపు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పాఠశాల విద్యార్థులకు ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీల ఎంపిక చేయనున్నారు. అండర్-17 బాలబాలికలకు శుక్రవారం, అండర్-14 బాలబాలికలకు ఈ పోటీలు ఉండనున్నాయి. రేపు కబడ్డీ, వాలీబాల్, చదరంగం పోటీలు ఉంటాయని ఐటీడీఏ క్రీడాధికారి గోపాల్ రావు తెలిపారు.