హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్‌ను నియమించాలి

MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్ లేకపోవడంతో సిబ్బంది, రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో చాలా కాలంగా స్వీపర్ పోస్టు ఖాళీగా ఉంది. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, సిబ్బందికి సహాయంగా ఉండడంలో స్వీపర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే స్వీపర్ లేకపోవడంతో ఆసుపత్రితో పాటు పరిసరాలను శుభ్రం చేసేవారు కరువయ్యారు.