హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ తీగ తగిలి వృద్ధుడు మృతి

జగిత్యాల: తెగిపడిన విద్యుత్ తీగ తగిలి వృద్ధుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. వేములకుర్తికి చెందిన బల్గం ఆశన్న (70) బుధవారం పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా వ్యవసాయ భూమిలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి మృతి చెంది కనిపించారు. మృతుడి కోడలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.