హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ బడులలో పెండింగ్ యూనిఫాంలు ఇవ్వాలి: హరీష్ రావు

SDPT: జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌ను ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ స్కూల్‌లో నిర్వహించడంపై ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ బడుల్లోనే నిర్వహించి జాతీయ అవార్డులు సాధించామని గుర్తు చేశారు. సిద్దిపేటపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ, వెంటనే బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయాలని, పెండింగ్ యూనిఫాంలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.