హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్ప ఆయకట్టులో సాగుపై ఉత్కంఠ

MLG: రామప్ప సరస్సులో 30 అడుగులకు పైగా నీరు ఉన్నప్పటికీ యాసంగి వరి సాగుపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో నిరీక్షణ కొనసాగుతోంది. సుమారు 6 వేల ఎకరాలకు రెండో పంట సాగు చేసే సామర్థ్యం ఉన్నా అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో రైతులు సందిగ్ధంలో ఉన్నారు. సాగుకు అనుమతి కోసం రైతులతో పాటు వ్యవసాయ పనులపై ఆధారపడే కూలీలు ఎదురుచూస్తున్నారు.