హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిర్యాలగూడ ఎస్బీఐలో రుణాల అవకతవకలు

NLG: మిర్యాలగూడ ఎస్బీఐ శాఖలో రుణాల మంజూరులో అక్రమాలు జరిగినట్లు అంతర్గత విచారణలో వెల్లడైంది. మూడు ఖాతాలకు రూ.7.54 కోట్ల పరిమితి ఉండగా, బకాయిలు రూ.15.36 కోట్లకు చేరినట్లు గుర్తించారు. దీనిపై ప్రాంతీయ మేనేజర్ పల్లె పద్మబాబుగౌడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.