హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి ఉమ్మడి జిల్లా క్రీడా ఎంపికలు

BDK: పాల్వంచ మండలం కిన్నెరసాని క్రీడా పాఠశాలలో నేడు, రేపు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పాఠశాల విద్యార్థులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి క్రీడా పోటీల ఎంపికలు నిర్వహించనున్నారు. అండర్-17 బాలబాలికలకు శుక్రవారం, అండర్-14 బాలబాలికలకు ఈ పోటీలు ఉండనున్నాయి. శనివారం కబడ్డీ, వాలీబాల్,క్యారమ్స్, చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు ఐటీడీఏ క్రీడాధికారి గోపాల్ రావు తెలిపారు.