NZB: ఆర్మూర్ మండలం సిద్దులగుట్ట వద్ద అమ్మాయిలను వేధిస్తున్న ఓ ఆకతాయిని షీ టీమ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఆర్మూర్ పోలీసులకు అప్పగించారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్ పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
తెలంగాణ
ఆకతాయి ఆటకట్టించిన షీ టీమ్ పోలీసులు


