BDK: భద్రాచలం ఆలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 10 నుంచి 30 వరకు అధ్యయనోత్సవాలు, 19న తెప్పోత్సవం, 20న ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, రవాణా, భద్రత, వసతి సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్


