హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్ధరాత్రి కారు బీభత్సం.. యువకుడు దుర్మరణం

RR: మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్ గండిపేట ఎక్స్‌రోడ్డు వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. అన్నయ్య పెళ్లి శుభలేఖలు పంచి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి పోలీస్ బూత్, వాటర్ పైప్‌లైన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సివిల్స్‌కు సిద్ధమవుతున్న మాదాపూర్ వాసి సాయి గౌరవ్ రెడ్డి (23) అక్కడికక్కడే మరణించగా, స్నేహితుడు ఆనంద్ (24) గాయపడ్డాడు.