తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న 57,756 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే 21,917 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా రూ.4.30 కోట్ల ఆదాయం లభించింది.
భక్తి
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ


