KDP: కలసపాడు మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో YCP బలపరిచిన అభ్యర్థి చిత్త రాజశేఖర్ విజయం సాధించారు. AP ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డికి అన్న కుమారుడైన రాజశేఖర్ తన సమీప ప్రత్యర్థి తిరుపతి రెడ్డిపై 557 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఆధిక్యం కనబరిచిన ఆయన చివరకు విజయాన్ని ఖరారు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కలసపాడు సర్పంచ్‌గా చిత్త రాజశేఖర్ విజయం


