హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోడల్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు ఏర్పాటు

NTR: విజయవాడలో పాస్‌పోర్టు సేవా కేంద్రం తరహాలో ఆధునిక మోడల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం తొలి విడతగా రూ.50 లక్షలు మంజూరు చేసిందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గురువారం తెలిపారు. డీఐఎల్ఆర్ఎంపీ 3.0, నక్షా పథకాల కింద ఇది ఏర్పాటవుతుంది. రిజిస్ట్రేషన్లు సులభంగా, వేగంగా, పారదర్శకంగా జరిగేలా చేయడమే లక్ష్యమని ఆయన చెప్పారు.