హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేడ్ నుంచి పండరీపూర్, తుల్జాపూర్ ప్రత్యేక టూర్

SRD: ఖేడ్ నుంచి పండరీపూర్ విఠల్ రుక్మిణి, తుల్జాపూర్ తుల్జాభవాని ప్రత్యేక దైవ దర్శన టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు DM సుబ్రహ్మణ్యం తెలిపారు. రేపు రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి ఆదివారం రాత్రి 8 గంటలకు తిరిగి చేరుకుంటుంది. పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.500 టికెట్ ధర నిర్ణయించారు. 40 మంది బుకింగ్ ఉంటే గ్రామం లేదా కాలనీ వద్దకు బస్సు వస్తుందన్నారు.