KMR: నాగిరెడ్డిపేట మండలం మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన బోయిని దాసు (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం సాయంత్రం తన పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో దాసు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


