కృష్ణా: పమిడిముక్కల మండలం మంటాడ సర్పంచ్ అభ్యర్థి మేరుగ లక్ష్మి గురువారం ఇందిరమ్మ కాలనీ, SC కాలనీ, రెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. తమ 14 మంది వార్డు సభ్యులతో కలిసి ప్రచారం సాగించారు.
ఆంధ్రప్రదేశ్
మంటాడలో సర్పంచ్ అభ్యర్థి ప్రచారం


