హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రీకౌంటింగ్ 2 ఓట్లతో గెలుపు

కోనసీమ: మామిడికుదురు మండలం మాకనపాలెం సర్పంచ్గా టీడీపీ మద్దతుదారు సోంపల్లి రేణుక విజయం సాధించారు. కొంబత్తుల అమ్మాజీతో జరిగిన హోరాహోరీ పోరులో తొలుత ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. ఇందులో రేణుక 2 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో రిటర్నింగ్ అధికారి ఆమెను విజేతగా ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు.