హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుమంట్ర సర్పంచ్‌గా కోటేశ్వరరావు విజయం

WG: పెనుమంట్ర గ్రామపంచాయతీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన శీలబోయిన కోటేశ్వరరావు సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్ లో కోటేశ్వరరావు పై చేయి సాధించడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, అంతే నిబద్ధతతో గ్రామ అభివృద్ధి కోసం అలుపెరగని యోధుడిగా పని చేస్తానని అన్నారు.