HNK: మైనర్ బాలికను పలుమార్లు వేధింపులకు గురిచేసిన యువకుడిపై గురువారం హసన్పర్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను వేధిస్తుండటంతో కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు.
తెలంగాణ
బాలికకు వేధించిన యువకుడిపై పోక్సో కేసు


