హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామన్నగూడెం సర్పంచ్‌గా రెడ్డి వీరాంజనేయులు విజయం

కృష్ణా: బాపులపాడు మండలం రామన్నగూడెం సర్పంచ్గా రెడ్డి వీరాంజనేయులు ఘన విజయం సాధించారు. 90 ఓట్ల మెజార్టీతో కూటమి బలపర్చిన అభ్యర్థి రెడ్డి వీరాంజనేయులు గెలుపు నమోదు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు సంబరాల్లో ఉన్నారు. గెలిచిన సర్పంచ్ రెడ్డి వీరాంజనేయులు మాట్లాడుతూ, తనకు విజయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.