హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత ఆన్‌లైన్ శిక్షణ.. దరఖాస్తులకు ఆహ్వానం

AKP: డీఎస్సీకి సిద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు గౌతులచ్చన్న బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేశ్వరి తెలిపారు. వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 30లోగా ఎంవీపీ కాలనీ సెక్టార్-6లోని స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని, వివరాలకు 94925 69177 నంబరును సంప్రదించాలని కోరారు.