NLR: పంచాయతీ ఎన్నికల విధులకు ఆత్మకూరు డిపో నుంచి 26 బస్సులను కేటాయించినట్లు డిపో మేనేజర్ ఎం. శివకేశ్ యాదవ్ తెలిపారు. దీంతో ఈ నెల 28, 29 తేదీల్లో ఆత్మకూరు-ఏఎస్ పేట, కావలి, సోమశిల, చేజర్ల, కలువాయి మార్గాల్లో బస్సు సర్వీసులు తగ్గనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బస్సు సర్వీసులకు అంతరాయం


