హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు

బాపట్లలో తొలి విడత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ తెలిపారు. 44 వార్డుల్లో 88, 62 పంచాయతీల్లో 657 పోలింగ్ కేంద్రాల్లో సజావుగా ఓటింగ్ జరిగిందన్నారు. ఎన్నికల కోడ్, సెక్షన్ 30 అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు.