హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొంపిచర్ల గ్రామ సర్పంచిగా తిరుపతమ్మ ఘన విజయం

PLD: రొంపిచర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బండారు తిరుపతమ్మ 1,593 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొత్తం 3,737 ఓట్లు పోలవగా, తిరుపతమ్మకు 2,586 ఓట్లు లభించాయి. 14 వార్డులకు గాను 12 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఫలితాలు వెలువడగానే వైసీపీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.