హైదరాబాద్: 28°C
తెలంగాణ

శబరిమల అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైలు

ASF: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల రైల్వేస్టేషన్ నుంచి కొల్లాం మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 11న కాగజ్ నగర్ నుంచి ఉదయం 4 గంటలకు ఈ ప్రత్యేక రైలు బయలుదేరి 12న సాయంత్రానికి కొల్లాంకు చేరుకుంటుంది. కాగజ్నగర్ నుంచి ప్రత్యేక రైలు నడపడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.