GNTR: ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా వైసీపీ బలపర్చిన మాకాని అన్నపూర్ణ, కుమారిల నామినేషన్ల అప్పీల్‌ను ఆర్డీవో శ్రీనివాసరావు పరిశీలించి, ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. వైసీపీ కార్యకర్తలు టపాసులు కాల్చారు. సర్పంచ్ అభ్యర్థిగా మాకాని అన్నపూర్ణకు గ్రీన్ సిగ్నల్ రావటంతో పోటీ ఉత్కంఠగా మారింది.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం..!గ్రామంలో సంబరాలు


