మంచిర్యాల జిల్లా AITUC ప్రధాన కార్యదర్శి మేకల దాసు ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు. బెంగుళూరులో 4 రోజుల పాటు జరిగిన జాతీయ మహాసభల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2000 సంవత్సరం నుంచి విద్యార్థి, కార్మిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయన AITUC రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామన్నారు.
తెలంగాణ
ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులుగా మేకల దాసు


