హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పీఎం శ్రీ స్కూల్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి'

NLG: నల్గొండ రామనగర్‌లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం ఎదుట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మేయర్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. భారీ వాహనాలు వేగంగా వెళ్తుండటంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రారంభ, ముగింపు సమయాల్లో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.