ATP: విద్యానగర్లోని అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు సంకష్ట గణపతి హోమం నిర్వహిస్తున్నట్లు అర్చకులు ద్వారకాస్వామి పేర్కొన్నారు. భక్తులు హోమ పూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ హోమంలో పాల్గొనడం వల్ల విఘ్నాలు తొలగి, కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు గణపతి హోమం


