హైదరాబాద్: 28°C
వార్తలు

ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీ

ఈనెల 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీ ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరగనుంది. సోనియా అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడంతో పాటు, డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలనే అంశంపై చర్చించనున్నారు.