ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని అగరగూడ గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి ఇళ్లల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 8 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్..8 లీటర్ల గుడుంబా స్వాధీనం


