హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బోరంపల్లిలో 28 ఓట్ల మెజారిటీతో వైసీపీ విజయం

ATP: కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి రామాంజినేయులు విజయం సాధించారు. గురువారం జరిగిన తొలివిడత పోలింగ్, ఓట్ల లెక్కింపులో ఆయనకు 780 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, టీడీపీ మద్దతుదారు హరిజన గోపాల్‌కు 752 ఓట్లు పోలయ్యాయి. దీంతో రామాంజినేయులు 28 ఓట్ల స్వల్ప మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు.