హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేటలో శనివారం జాబ్ మేళా

SRPT: సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నారని ఉపాధి అధికారి ఎండీ జానీ పాషా తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా ఉంటుందని పేర్కొన్నారు.  ఐదు ప్రైవేట్ సంస్థల్లో 400 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసున్న పదో తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులని పేర్కొన్నారు.