హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్క ఓటుతో గెలుపు.. టీడీపీ రెబల్ అభ్యర్థి సంచలనం

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని నడింపాలెం పంచాయతీలో టీడీపీ రెబల్ స్వతంత్ర అభ్యర్థి లోతా అప్పలకొండ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అప్పలకొండకు 189ఓట్లు రాగా, వైసీపీ మద్దతుతో పోటీ చేసిన దూరి రాజుబాబుకు 188ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు మెజారిటీతో అప్పలకొండ గెలుపొందారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా, చివరకు ఒక్క ఓటు గెలుపోటములను నిర్ణయించింది.