హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయస్థాయి బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్‌కు జిల్లా వాసి ఎంపిక

VSP: జాతీయస్థాయి అండర్ 17 బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు సాగర్ నగర్‌కు చెందిన క్రీడాకారుడు చందు ఎంపికైనట్లు సాగర్ నగర్ బాస్కెట్ బాల్ అకాడమీ శిక్షకుడు సునీల్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో చందు ప్రతిభ కనబరచడంతో మహారాష్ట్రలో త్వరలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు.