హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు!

VSP: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతయ్యాడు. పెద జాలరిపేటకు చెందిన చింతపల్లి పోలయ్య (50), కుమారుడు ముత్తిరాజు గురువారం తెల్లవారుజామున 3 గంటలకు తెరచాప పడవపై వేటకు వెళ్లారు. అలల తీవ్రతతో లంగరు వేసిన బోటు గొలుసు తగిలి తెప్ప బోల్తా పడింది. ముత్తిరాజు ఒడ్డుకు చేరగా పోలయ్య గల్లంతయ్యాడు. మత్స్యకారులు నాలుగు పడవలతో గాలించారు.