KMR: 70వ SGF అండర్-17 బాలికల ఉమ్మడి జిల్లా నెట్‌బాల్ పోటీల్లో బిచ్కుందలోని ZPHS హస్గుల్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ విషయాన్ని పాఠశాల HM అంజయ్య తెలిపారు. అలాగే ఇందు, సమీక్ష అనే విద్యార్థినీలు ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులను పిఈటీ రఘురాం, పాఠశాల సిబ్బంది అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
నెట్‌బాల్‌లో హస్గుల్ బాలికల జట్టుకు ద్వితీయ స్థానం


