హైదరాబాద్: 28°C
వార్తలు

పంటల బీమా నమోదు రెట్టింపు: అచ్చెన్న

AP: పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీపై YCP తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్-2025తో పోలిస్తే ఖరీఫ్-2026లో పంటల బీమా నమోదు రెట్టింపునకు పైగా పెరిగిందన్నారు. ఖరీఫ్-2026లో సాగైన 31.01 లక్షల హెక్టార్లలో 17.07 లక్షల హెక్టార్లు (55.05%) బీమా పరిధిలోకి వచ్చాయని తెలిపారు. పంటల బీమా విస్తీర్ణంలో ఏపీ దేశంలోనే ఆరో స్థానంలో ఉందని వెల్లడించారు.