AP: తొలి విడత పంచాయతీ, మలి విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని DGP హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు, ప్రత్యేక నిఘాతో అవాంఛనీయ ఘటనలను అడ్డుకున్నామన్నారు. 23 పట్టణ స్థానిక సంస్థల బ్యాలెట్ బాక్సులకు భద్రత కల్పించామన్నారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
వార్తలు
ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: DGP


