ఉమ్మడి వరంగల్ జిల్లా గంగారం మండలం కొడిశాల మిట్ట అంగన్వాడీ కేంద్రంలో నిన్న కలెక్టర్ తనిఖీ సందర్భంగా, ఓ చిన్నారితో జరిగిన సంభాషణ ఆకట్టుకుంది. అంగన్వాడీ ఎప్పుడు తీశారు, టీచర్ ఏం పాఠాలు చెప్పారని కలెక్టర్ అడగగా.. టీచర్ ఈ రోజే వచ్చారని, అ ఆ ఇ ఏబీసీడీలు మాత్రమే వచ్చని బాలుడు నిజాయితీగా చెప్పాడు. బాలుడికి బహుమతి అందించి, ఇక సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
వార్తలు
బాలుడి నిజాయితీకి బహుమతి ఇచ్చిన కలెక్టర్


