హైదరాబాద్: 28°C
వార్తలు

డిప్యుటేషన్లపై తల్లిదండ్రుల ధర్నా

ఉమ్మడి ఖమ్మం జిల్లా జగన్నాథపురం జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి ఇప్పటికే ముగ్గురు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపగా, తాజాగా ఇంగ్లిష్ మీడియం సోషల్ టీచర్‌నూ పంపడంతో తల్లిదండ్రులు నిరసన తెలిపారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున డిప్యుటేషన్లు ఆపి టీచర్లను పాఠశాలలోనే కొనసాగించాలని ప్రధానోపాధ్యాయురాలు వెంకట నర్సమ్మకు వినతిపత్రం ఇచ్చారు. పరిష్కరించకపోతే ఆందోళన పెంచుతామన్నారు.