హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆనందపురం హైవేపై కారు దగ్ధం.. డ్రైవర్ మృతి!

VSP: ఆనందపురం మండలం మామిడిలోవ హైవేపై గురువారం రాత్రి ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కారులో ఉన్న డ్రైవర్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.