హైదరాబాద్: 28°C
వార్తలు

బాసర హంసవాహినిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

NRML: బాసరలోని హంసవాహిని పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. కరస్పాండెంట్ ఓంకార్ దేశాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులు రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చి, ప్రాథమిక హక్కులు, బాధ్యతలను వివరించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కులను కాపాడుకోవాలని సూచించారు.