ASF: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని ఎంపీ గొడం నగేశ్ అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ హరిత, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబుతో కలిసి పాల్గొన్నారు. జనరిక్ మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని, అన్ని విభాగాలు సమర్థంగా పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు: ఎంపీ నగేశ్


