హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవోదయ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

BHPL: జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షను ఈ నెల 28న ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. BHPL, కాటారం పరీక్ష కేంద్రాల్లో మొత్తం 399 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, వైద్య సదుపాయాలు వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.