NZB: సాలుర గ్రామంలోని 4 వ్యాపార సముదాయాల షట్టర్లను ఈ నెల 28వ తేదీన బహిరంగ వేలం వేస్తున్నట్లు గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్, మండల పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.25 వేలు డిపాజిట్ చెల్లించి, తమ పేర్లను నమోదు చేసుకొని వేలంలో పాల్గొనాలని సూచించారు.
తెలంగాణ
సాలురలో 4 షట్టర్ల బహిరంగ వేలం


